logo

త్వరలో విర్డ్‌లో ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ

ద్వారకాతిరుమల విర్డ్‌ ఆసుపత్రిలో త్వరలో జనరల్‌ సర్జరీ, ఈఎన్టీలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆసుపత్రి ట్రస్టు ఛైర్మన్‌ ఎసీˆ్వ సుధాకరరావు తెలిపారు.

Published : 24 May 2024 03:50 IST

రోగులకు కృత్రిమ అవయవాలు  అందజేస్తున్న ఎంఎం గుప్తా  

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల విర్డ్‌ ఆసుపత్రిలో త్వరలో జనరల్‌ సర్జరీ, ఈఎన్టీలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని ఆసుపత్రి ట్రస్టు ఛైర్మన్‌ ఎసీˆ్వ సుధాకరరావు తెలిపారు. ఆసుపత్రిలో ట్రస్టు కార్యవర్గ సభ్యుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా 23 మంది దివ్యాంగులకు కాలిపర్స్, ప్రమాదవశాత్తు కాళ్లు పోగొట్టుకున్న వారికి అత్యాధునిక కృత్రిమ అవయవాలను ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ వి.ఆనందరాజు, ట్రస్టు సభ్యులు ఐవీఆర్‌ సుధాకరరావు, వి.నారాయణమూర్తి, ఎం.ఎం.గుప్త, సీˆహెచ్‌ రాజమోహన్, కేఎస్‌ఎస్‌ వంశీ, స్థానిక దేవస్థానం ఈవో వేండ్ర త్రినాథరావు అందజేశారు. గుప్తా ఫౌండేషన్‌ సహకారంతో కాలిపర్స్, కృత్రిమ అవయవాలను అందజేసినట్లు ట్రస్ట్‌ ఛైర్మన్‌ తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు భవ్యచంద్, హమీద్, బాలాజీ, విహారి, నాగేంద్రబాబు, సింధు, గాయత్రి, ఏవో ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని