logo

ఆకట్టుకున్న అన్నమాచార్య సంకీర్తన స్వరార్చన

స్థానిక జువ్వలపాలెం రోడ్డులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్‌ ఆధ్వర్యాన తాళ్లపాక అన్నమాచార్య 616వ జయంతి, ఉద్దరాజు వెంకటలక్ష్మినరసయ్య వర్ధంతి కార్యక్రమాలను గురువారం నిర్వహించారు.

Published : 24 May 2024 03:50 IST

భీమవరం గునుపూడి, న్యూస్‌టుడే: స్థానిక జువ్వలపాలెం రోడ్డులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్‌ ఆధ్వర్యాన తాళ్లపాక అన్నమాచార్య 616వ జయంతి, ఉద్దరాజు వెంకటలక్ష్మినరసయ్య వర్ధంతి కార్యక్రమాలను గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సప్తగిరి శ్రీనివాసుని సంకీర్తనా ద్విశతాధిక గళ స్వరార్చన వేడుకను అట్టహాసంగా చేపట్టారు. సుమారు 240 మంది స్థానిక, స్థానికేతర కళాకారులు పాల్గొని అన్నమాచార్య కీర్తనలు ఆలపించారు. డాక్టర్‌ గజల్‌ శ్రీనివాస్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని అన్నమయ్య సంకీర్తన స్వరార్చన గ్రంథాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. భక్తి ఉద్యమానికి ఆత్మ అన్నమయ్య అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రేడియో, టీవీ కళాకారులు ప్రభావతి పైడిరాజు, ఫౌండేషన్‌ అధ్యక్షుడు ఉద్దరాజు కాశీవిశ్వనాథరాజు, కంతేటి వెంకట్రాజు, డీవీఎస్‌ చంద్రాజీ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని