logo

మంచినీరే మకరందం!

పువ్వుల్లోని మకరందాన్ని జుర్రుకోవాల్సిన తేనెటీగలు మంచినీటి కోసం అల్లాడిపోయాయి. మండుటెండలకు తాళలేక కొళాయి చెంతకు చేరాయి.

Updated : 24 May 2024 05:13 IST

ఈనాడు, ఏలూరు : పువ్వుల్లోని మకరందాన్ని జుర్రుకోవాల్సిన తేనెటీగలు మంచినీటి కోసం అల్లాడిపోయాయి. మండుటెండలకు తాళలేక కొళాయి చెంతకు చేరాయి. బొట్టు బొట్టుగా జారుతున్న నీటి బిందువులను తొండంతో ఒడిసిపట్టి దాహార్తిని తీర్చుకున్నాయి. అనంతరం నీటిలో జలకాలాడుతూ చక్కర్లు కొట్టి వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాయి. ఏలూరు శాంతినగర్‌ లోని నీటిశుద్ధికేంద్రం ఆవరణలోని కొళాయి చెంత ‘ఈనాడు’ కెమెరాకు చిక్కిన చిత్రాలివి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని