logo

రథం కదలగా.. భక్తజనం మురవగా!

కాళ్లకూరు క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కల్యాణోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారి రథోత్సవం రమణీయంగా నిర్వహించారు.

Published : 24 May 2024 04:06 IST

నేత్రపర్వంగా శ్రీవారి కల్యాణోత్సవం

కాళ్ల: రథోత్సవంలో పాల్గొన్న భక్తులు 

కాళ్ల, న్యూస్‌టుడే: కాళ్లకూరు క్షేత్రంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ కల్యాణోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం స్వామివారి రథోత్సవం రమణీయంగా నిర్వహించారు. తొలుత సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. జిల్లా దేవాదాయ శాఖాధికారి సుబ్బారావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆపై ప్రధాన వీధుల్లో గోవింద నామస్మరణ నడుమ భక్తులు రథం లాగి మురిసిపోయారు. ఏర్పాట్లను ఆలయ ఈవో ఎం.అరుణ్‌కుమార్, సిబ్బంది పర్యవేక్షించారు.

చెన్నకేశవస్వామి ఆలయంలో..

ఉండి, న్యూస్‌టుడే: ఉప్పులూరులో కొలువైన చెన్నకేశవస్వామి ఆలయంలో స్వామివారి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. వైశాఖ శుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం విశేషంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. వివిధ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి రథం లాగి మొక్కులు తీర్చుకున్నారు.

రాజమన్నార్‌గా శ్రీనివాసుడు!

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శేషాచలంపై వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి ప్రత్యేక అలంకారాలు భక్తులను కనువిందు చేస్తున్నాయి. దీనిలో భాగంగా గురువారం రాజమన్నార్‌  అలంకారంలో శ్రీవారు భక్తులకు దర్శనమిచ్చారు.  

కల్యాణోత్సవాల్లో ఈనాడు..

  • ఉదయం 10.30గంటలకు చక్రవారి-అవభృథోత్సవం.
  • మధ్యాహ్నం 3గంటలకు వేద సదస్సు
  • రాత్రి 7గంటలకు పూర్ణాహుతి, మౌనబలి, ధ్వజావరోహణ 
  • రాత్రి 8కి అశ్వవాహనంపై గ్రామోత్సవం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని