logo

వక్ఫ్‌ బోర్డు భూములు అన్యాక్రాంతం కానివ్వొద్దు: కలెక్టర్‌

జిల్లాలో వక్ఫ్‌బోర్డు భూములను అన్యాక్రాంతం కానివ్వొద్దని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 19 Mar 2023 05:51 IST

మాట్లాడుతున్న ప్రసన్న వెంకటేశ్‌

ఏలూరు కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో వక్ఫ్‌బోర్డు భూములను అన్యాక్రాంతం కానివ్వొద్దని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వక్ఫ్‌బోర్డు భూముల రిజిస్ట్రేషన్‌ను ప్రభుత్వం నిషేధించిందని, జిల్లా ఈ తరహా స్థలాల చుట్టూ కంచెలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఆర్వో సత్యనారాయణమూర్తి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి కృపావరం, జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్‌ ఎండీ షఫీరుల్లా, జిల్లా రిజిస్ట్రార్‌ ఎ.వెంకటేశ్వరరావు, డీపీవో మల్లికార్జునరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి సారించాలి.. జిల్లాలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ అన్నారు. మండలస్థాయి అధికారులతో కలెక్టరేట్‌ నుంచి శనివారం దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల లోపు చిన్నారులు, కిశోర బాలికలు, గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపాలను అధిగమించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో డ్రాప్‌అవుట్స్‌ నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ‘ఫ్యామిలీ డాక్టర్‌’ కార్యక్రమాన్ని విధిగా అమలు చేసేలా ఎంపీడీవోలు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శిక్షణ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, డీఆర్వో సత్యనారాయణమూర్తి తదితర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని