logo

ఎస్సీ వర్గీకరణతోనే మాదిగల అభ్యున్నతి

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ జరిగితేనే అన్ని రంగాల్లో మాదిగల అభ్యున్నతి సాధ్యమని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం పోలీస్‌ ఐలాండ్‌ కూడలిలోని గీతా ఫంక్షన్‌ హాలులో శుక్రవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మహాసభ యార్లగడ్డ రత్నరాజు అధ్యక్షతన నిర్వహించారు.

Updated : 24 Feb 2024 05:36 IST

సభలో మాట్లాడుతున్న మందకృష్ణ మాదిగ

తాడేపల్లిగూడెం వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ జరిగితేనే అన్ని రంగాల్లో మాదిగల అభ్యున్నతి సాధ్యమని మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. తాడేపల్లిగూడెం పట్టణం పోలీస్‌ ఐలాండ్‌ కూడలిలోని గీతా ఫంక్షన్‌ హాలులో శుక్రవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్‌ అనుబంధ సంఘాల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మహాసభ యార్లగడ్డ రత్నరాజు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంద కృష్ణ మాట్లాడుతూ వర్గీకరణ లేకపోవడంతో విద్య, రాజకీయం వంటి రంగాల్లో మాదిగలు వెనకబడి ఉన్నారని తెలిపారు. 30 సంవత్సరాలుగా ఎమ్మార్పీఎస్‌ ఉద్యమం కొనసాగుతూనే ఉందని, రాజకీయ పార్టీలు మాదిగలను మోసం చేస్తూనే ఉన్నాయన్నారు. గతంలో వర్గీకరణకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఇచ్చిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మాదిగలను రాజకీయంగా ఉపయోగించుకుని వర్గీకరణకు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు మాదిగలకు రిజర్వేషన్‌ కల్పించి విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో అవకాశాలు కల్పించి రాష్ట్ర విభజన సమయంలో అవకాశవాదుల మాటలు విని తన వెంట ఉన్న మాదిగలను విస్మరించారన్నారు. లక్షలాది సంఖ్యలో మాదిగలను వాడుకుని వదిలేసిన తెదేపా, వైకాపాలను పక్కనబెట్టి భాజపాకు ఓటువేయాలని పిలుపునిచ్చారు. వర్గీకరణ కీలక దశలో ఉందని దాన్ని సాధించేందుకు కేంద్రంలో ఉన్న భాజపాకు మద్దతు పలకాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకులు బయ్యారపు రాజేశ్వరరావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు శెట్టే ఝాన్సీరాణి, ఎమ్‌ఎల్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు చెప్పుల వాసు, జిల్లా అధికార ప్రతినిధి కొల్లి రాజశేఖర్‌, రాష్ట్ర నాయకురాలు చవటపల్లి విజయ, నియోజకవర్గ కన్వీనర్‌ దేవతల శివాజి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని