logo

పోలింగ్‌ శాతం పెంచడమే లక్ష్యం

ఓటర్లను చైతన్యవంతం చేసి వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పోలింగ్‌ ను 92 శాతానికి పెంచటమే లక్ష్యంగా స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తూతిక శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ అన్నారు. ఏలూరు లోని నగర పాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి స్వీప్‌ నోడల్‌ అధికారి అయిన శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Published : 24 Feb 2024 03:25 IST

ఈవీఎంల వినియోగంపై అవగాహన కల్పిస్తున్న డీపీవో శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ తదితరులు

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: ఓటర్లను చైతన్యవంతం చేసి వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పోలింగ్‌ ను 92 శాతానికి పెంచటమే లక్ష్యంగా స్వీప్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తూతిక శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ అన్నారు. ఏలూరు లోని నగర పాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి స్వీప్‌ నోడల్‌ అధికారి అయిన శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విరివిగా వీటిని నిర్వహిస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ఓటు హక్కు వినియోగం పై అవగాహన కల్పించేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకోవాలన్నారు. పోలింగ్‌ రోజుల విధిగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లాలని ఓటు వేయాలన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత అని వృద్ధులకు వికలాంగులకు పోలింగ్‌ కేంద్రాల వద్ద అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అడిషనల్‌ కమిషనర్‌ చంద్రయ్య, అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ నాగేశ్వరరావు, అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. పలువురికి ఓటు హక్కు వినియోగంపై, ఈవీఎంల వినియోగంపై అవగాహన కల్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని