logo

రవాణారంగ కార్మికులకు సంక్షేమ చట్టం అవసరం

ఆటో, క్యాబ్‌ వాహనాలపై విధించిన ‘ఈ’ చలానాలను రద్దు చేయాలని, అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిన స్టాప్‌లైన్‌, సీసీ కెమెరాలు నిలిపివేయాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌, జిల్లా కార్యదర్శి జె.గోపి డిమాండ్‌ చేశారు.

Published : 24 Feb 2024 03:27 IST

రిలే దీక్ష చేస్తున్న ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు

ఏలూరు వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: ఆటో, క్యాబ్‌ వాహనాలపై విధించిన ‘ఈ’ చలానాలను రద్దు చేయాలని, అస్తవ్యస్తంగా ఏర్పాటు చేసిన స్టాప్‌లైన్‌, సీసీ కెమెరాలు నిలిపివేయాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజఫర్‌ అహ్మద్‌, జిల్లా కార్యదర్శి జె.గోపి డిమాండ్‌ చేశారు. ఏలూరులోని పాత బస్టాండ్‌ సెంటర్‌ వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రవాణా రంగాన్ని దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్‌ 21 రద్దు చేయాలని, ప్రమాదాలు జరిగినప్పుడు గాయపడి మరణించిన డ్రైవర్ల కుటుంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేయాలని, రవాణా రంగ కార్మికులను ఆదుకునేలా వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్‌ సుందరయ్య, సీపీఎం నగర కార్యదర్శి కిషోర్‌ డ్రైవర్లకు నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బి.శ్రీనివాస్‌, పి.శ్రీనివాస్‌, పీఎన్‌ ప్రసాద్‌, ఆంజనేయులు, పాపినాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని