logo

ఇటు వృథా.. అటు వ్యధ..!

ఏలూరులోని అల్లూరి సీతారామరాజుకాలనీ, నల్లదిబ్బ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. ఏ ఇంటి ముందు చూసినా డ్రమ్ములు, బిందెలు కనిపిస్తున్నాయి.

Published : 24 Feb 2024 03:30 IST

అల్లూరి సీతారామరాజు కాలనీలో ఇంటింటా ఏర్పాటు చేసుకున్న డ్రమ్ములు

ఏలూరులోని అల్లూరి సీతారామరాజుకాలనీ, నల్లదిబ్బ ప్రాంతాల్లో ప్రజలు తాగునీటికి అవస్థలు పడుతున్నారు. ఏ ఇంటి ముందు చూసినా డ్రమ్ములు, బిందెలు కనిపిస్తున్నాయి. ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు నగర పాలక సంస్థ అధికారులకు అర్జీలిచ్చినా ప్రయోజనం కనిపించడం లేదని అంటున్నారు. ట్యాంకర్ల కోసం ప్రజలు ఎదురుచూడటం పరిపాటిగా మారింది. అలాగే  జయప్రకాశ్‌నగర్‌, నాగేశ్వరపురం, రామానగర్‌ కాలనీలలో ఇంటింటికీ తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేయలేదని, వీధుల్లో అక్కడక్కడా ఏర్పాటు చేశారని స్థానికులు చెబుతున్నారు. కొన్నిచోట్ల మురుగు కాలువలపై పైపు లైన్లు ఉన్నాయి.. మరికొన్నిచోట్ల లీకవుతున్నాయి. దీంతో తాగునీటిని వడకట్టుకుంటున్నారు. లీకేజీలను అరికట్టాలని, ఇంటింటికీ కొళాయిలు ఏర్పాటు చేసి తాగునీటిని అందించాలని వారంతా కోరుతున్నారు.

 ఈనాడు, ఏలూరు 

నాగేశ్వరపురం చెరువు పక్కన కుళాయి నుంచి లీకవుతున్న తాగునీరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని