logo

రెండు మేకలను చంపిన పులి

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరగపాడు సమీపంలో పులి రెండు మేకలను చంపింది. పోలవరం ఇన్‌ఛార్జి రేంజర్‌ దావీద్‌రాజు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ జిల్లా పరిధిలోని చేలల్లో నాలుగు రోజులుగా తిరుగుతున్న పులి శుక్రవారం తెల్లవారుజామున కరగపాడు శివారులో మేకల మందపై దాడి చేసింది.

Published : 24 Feb 2024 03:36 IST

కరగపాడు సమీపంలో ఘటన

పరిశీలిస్తున్న అధికారులు

పోలవరం, న్యూస్‌టుడే: తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం కరగపాడు సమీపంలో పులి రెండు మేకలను చంపింది. పోలవరం ఇన్‌ఛార్జి రేంజర్‌ దావీద్‌రాజు చెప్పిన వివరాల ప్రకారం.. ఆ జిల్లా పరిధిలోని చేలల్లో నాలుగు రోజులుగా తిరుగుతున్న పులి శుక్రవారం తెల్లవారుజామున కరగపాడు శివారులో మేకల మందపై దాడి చేసింది. ఇళ్ల సుబ్బారావుకు చెందిన రెండు మేకలను చంపింది. స్థానికుల అలజడితో వాటిని తినకుండా వెళ్లిపోయింది. రాత్రికి  తినడానికి వచ్చే అవకాశం ఉండటంతో ఆ మేకలను అక్కడే ఉంచి ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేశామని దావీద్‌రాజు తెలిపారు. శ్రీశైలం టైగర్‌ ప్రాజెక్టు నుంచి వచ్చిన అధికారులు, అటవీ శాఖ సిబ్బంది పులి కదలికలను పరిశీలించేందుకు గ్రామ పరిసరాల్లో మకాం వేసినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని