logo

ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత: నాదెండ్ల

వైకాపా ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో ఈ నెల 28న  జనసేన, తెదేపా ఉమ్మడిగా నిర్వహించే బహిరంగసభ స్థలాన్ని శుక్రవారం ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు.

Published : 24 Feb 2024 03:40 IST

మాట్లాడుతున్న జనసేన నేత మనోహర్‌. హాజరైన నాయకులు

పెంటపాడు, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో ఈ నెల 28న  జనసేన, తెదేపా ఉమ్మడిగా నిర్వహించే బహిరంగసభ స్థలాన్ని శుక్రవారం ఆయన నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో దిగిపోయే సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రూ.25 కోట్ల ప్రజాధనంతో రెండు హెలికాప్టర్లు తీసుకోవడం బాధ్యతారాహిత్యమన్నారు. ఏ రకం భద్రతా కారణాలతో ఇబ్బందులు పడుతున్నారో.. ఎందుకు ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రత్తిపాడులో ఆరు లక్షల మందితో సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సభా వేదికపై ఇరు పార్టీల నుంచి 250 మంది చొప్పున మొత్తం 500 మంది ఆశీనులయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. సభకు వచ్చే వారికి పార్కింగ్‌, ఇతర ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. సభకు రాష్ట్ర ప్రజలందరికీ ఆహ్వానం పలుకుతున్నామన్నారు.   రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పొత్తులో ఎలా ముందుకు వెళ్తామనే అంశాన్ని అధినేతలు పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబునాయుడు వివరిస్తారని వెల్లడించారు. ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ప్రకటిస్తారన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్‌, విడివాడ రామచంద్రరావు, పత్సమట్ల ధర్మరాజు, బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, కనకరాజు సూరి, రెడ్డి అప్పలనాయుడు, ఘంటసాల వెంకటలక్ష్మి, చేగొండి సూర్యప్రకాష్‌, సజ్జా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు