logo

వైకాపాను ఓడిస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు: తోట

రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైకాపాను ఓడిస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని తెదేపా పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి అన్నారు.

Published : 24 Feb 2024 03:41 IST

సభా ప్రాంగణాన్ని పరిశీలిస్తున్న సీతారామలక్ష్మి, తెదేపా నాయకులు

తాడేపల్లిగూడెం టూటౌన్‌, న్యూస్‌టుడే: రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైకాపాను ఓడిస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని తెదేపా పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి అన్నారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడులో ఈ నెల 28న తెదేపా, జనసేన ఉమ్మడిగా నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను శుక్రవారం జోన్‌-2 సమన్వయకర్త మందలపు రవి తదితర నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. అనంతరం తాడేపల్లిగూడెం ఎంవీఆర్‌ గ్రాండ్‌ హోటల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జి వలవల మల్లికార్జునరావు (బాబ్జీ) అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ వైకాపా అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు ప్రత్తిపాడులో జరిగే సభలో తెదేపా- జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ సమర శంఖం పూరిస్తారన్నారు. రాజధాని లేని రాష్ట్రాన్ని, పోలవరం పూర్తి చేయలేని స్థితిని, రోడ్లు  వేయలేని ప్రభుత్వాన్ని చూస్తున్నామన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన కూటమితోనే సాధ్యమని పేర్కొన్నారు. మందలపు రవి మాట్లాడుతూ ప్రత్తిపాడు సభకు సుమారు 6 లక్షల మంది హాజరవుతారన్నారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెదేపా, జనసేన కూటమి అఖండ విజయం సాధిస్తుందన్నారు. వలవల బాబ్జీ మాట్లాడుతూ తెదేపా- జనసేన ఉమ్మడి సభను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. రాబోయే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో తెదేపా, జనసేనల జెండా ఎగరడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, నాయకులు పొత్తూరి రామరాజు, గొర్రెల శ్రీధర్‌, పోతుల అన్నవరం, కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్‌, రవికుమార్‌, రాంపండు, అప్పన్న, సుబ్బరాజు, రమేష్‌, సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని