logo

బడి కోసం.. బాలల నిరసన

పాఠశాల మంజూరు చేయాలని కోరుతూ అర్తమూరు గ్రామానికి చెందిన విద్యార్థులు శుక్రవారం ఆర్‌అండ్‌బీ రహదారిపై పాఠాలు చదివి నిరసన తెలిపారు. కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు మాట్లాడుతూ  గ్రామంలో గతంలో సీబీసీఎన్‌సీ ఆధ్వర్యంలో పాఠశాల నడిచిందన్నారు.

Published : 24 Feb 2024 03:50 IST

రహదారిపై బైఠాయించిన విద్యార్థులు

అర్తమూరు (ఉండి), న్యూస్‌టుడే: పాఠశాల మంజూరు చేయాలని కోరుతూ అర్తమూరు గ్రామానికి చెందిన విద్యార్థులు శుక్రవారం ఆర్‌అండ్‌బీ రహదారిపై పాఠాలు చదివి నిరసన తెలిపారు. కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు మాట్లాడుతూ  గ్రామంలో గతంలో సీబీసీఎన్‌సీ ఆధ్వర్యంలో పాఠశాల నడిచిందన్నారు. ఆ సంస్థ పాఠశాలను ప్రభుత్వానికి అప్పగించిందని తెలిపారు. సుమారు 45 మంది ఎస్సీ, బీసీ విద్యార్థులు ఇక్కడే విద్యనభ్యసిస్తుండగా ప్రస్తుతం డిప్యుటేషన్‌పై వచ్చే ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారని తెలిపారు. దళిత విద్యార్థులకు పాఠశాల లేదన్నా అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి అర్తమూరు గ్రామంలో పాఠశాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని, రెగ్యులర్‌ ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. సర్పంచి గోనబోయిన వీర్రాజు, ఎంపీటీసీ సభ్యుడు దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఈ సమస్యపై జిల్లా స్థాయి స్పందన కార్యక్రమంలో అర్జీ ఇచ్చినా పరిష్కారం కాలేదని వాపోయారు. పాఠశాలకు 20 సెంట్ల స్థలాన్ని కేటాయించేలా  మండల పరిషత్తు సమావేశంలో తీర్మానం చేసినా భవన నిర్మాణానికి అధికారులు ముందుకు రాకపోవడం విచారకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని