logo

హలో 1950 .. ఏమిటా కథ?

ఎన్నికలకు సంబంధించి ఏ అంశం పైనైనా సందేహాలు నివృత్తి చేసుకోవడానికి, ఫిర్యాదులు చేయడానికి జిల్లా కలెక్టరేట్‌లో అందుబాటులో ఉన్న ఉచిత సహాయ వాణి (టోల్‌ఫ్రీ) నంబరు 1950.

Published : 03 Apr 2024 07:29 IST

కుక్కునూరు, న్యూస్‌టుడే: ఎన్నికలకు సంబంధించి ఏ అంశం పైనైనా సందేహాలు నివృత్తి చేసుకోవడానికి, ఫిర్యాదులు చేయడానికి జిల్లా కలెక్టరేట్‌లో అందుబాటులో ఉన్న ఉచిత సహాయ వాణి (టోల్‌ఫ్రీ) నంబరు 1950. ఎన్నికల సంఘం 1950 జనవరి 25న స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థగా ఏర్పాటైంది. ఇది ఎన్నికలకు సంబంధించినంత వరకూ స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. ప్రతిసారీ సాధారణ ఎన్నికల సమయంలో దేశవ్యాప్తంగా 50 లక్షల మంది ఉద్యోగుల సేవలను వినియోగించుకుంటుంది. దేశంలో మొదటిసారి సాధారణ ఎన్నికలను హిమాచల్‌ప్రదేశ్‌ లోని ‘చిని’లో నిర్వహించారు. ఆ సమయంలో అది పుట్టిన సంవత్సరం 1950 నంబరును ఆ సంస్థ ఉచిత సహాయ, ఫిర్యాదుల కోసం కేటాయించటం గమనార్హం. ఈ సహాయ కేంద్రం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 వరకూ అందుబాటులో ఉంటుంది.  

ఫిర్యాదులు చేయొచ్చు.. ఎన్నికల సమయంలో అధికారులు, ఉద్యోగులు నిబంధనలు పాటించకున్నా. అధికారులు ఎవరైనా రాజకీయ పార్టీలతో అంటకాగినా, వారు చేసే విందు, వినోదాల్లో పాల్గొన్నా ఫిర్యాదులు చేయొచ్చు. కొంత మంది అధికారులు దూర ప్రాంతాల నుంచి ఎన్నికల విధులకు వస్తుంటారు. పార్టీల నాయకులు వారికి వసతి, భోజన ఏర్పాట్లు చేస్తుంటారు. అటువంటి వారిపైనా ఫిర్యాదు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని