logo

ఒకే రాయి ఇద్దరికి ఎలా తగిలింది?: ఎంపీ రఘురామ

ఎవరో విసిరిన ఒకే గులకరాయి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నుదుటికి, వెలంపల్లి శ్రీనివాస్‌ కంటికి ఎలా తగిలిందని నరసాపురం ఎంపీ, తెదేపా నేత కనుమూరి రఘురామకృష్ణరాజు   ప్రశ్నించారు.

Updated : 17 Apr 2024 07:31 IST

భీమవరం పట్టణం, కాళ్ల, న్యూస్‌టుడే: ఎవరో విసిరిన ఒకే గులకరాయి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నుదుటికి, వెలంపల్లి శ్రీనివాస్‌ కంటికి ఎలా తగిలిందని నరసాపురం ఎంపీ, తెదేపా నేత కనుమూరి రఘురామకృష్ణరాజు  ప్రశ్నించారు. భీమవరంలోని తన నివాసôలో మంగళవారం నిర్వహించిన ‘రచ్చబండ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. శత్రువులంతా కలిసికట్టుగా వచ్చి ఒంటరిని చేసి పంగలి కర్రతో రాయి వేసి కొడితే నేను భయపడతానా, నా వెనుక ప్రజలు ఉన్నారని జగన్‌ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నుదుటిపై చిన్న గాటుకు 16 మంది వైద్యులు, 26 మంది నర్సుల బృందంతో కట్టు కట్టించుకోవాల్సిన అవసరం ఉందా అని ఎద్దేవా చేశారు.  

వివేకా హత్యలో జగన్‌, భారతిల ప్రమేయం.. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన భార్య భారతి ప్రమేయం ఉందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని రఘురామ పేర్కొన్నారు. వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత తాజాగా విలేకర్ల సమావేశంలో చెప్పిన నిజం ఇదేనని తాను భావిస్తున్నానన్నారు. ఈ కేసులో సీబీఐ విచారణ పూర్తయితే ప్రస్తుతానికి సూత్రధారిగా భావిస్తున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రధారిగా మారతారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు