logo

డీడీ అచ్చెన్న మృతిపై సమగ్ర విచారణ

కడప బహుళార్థ పశువైద్యశాల డీడీ సి.అచ్చెన్న (58) మృతిపై సమగ్ర విచారణ చేపడతామని డీఎస్పీ శ్రీధర్‌ పేర్కొన్నారు.

Published : 26 Mar 2023 04:51 IST

దస్త్రాలను పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీధర్‌

రామాపురం, న్యూస్‌టుడే: కడప బహుళార్థ పశువైద్యశాల డీడీ సి.అచ్చెన్న (58) మృతిపై సమగ్ర విచారణ చేపడతామని డీఎస్పీ శ్రీధర్‌ పేర్కొన్నారు. రామాపురం పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కర్నూలు-చిత్తూరు జాతీయ రహదారిలో గువ్వలచెరువు ఘాట్‌రోడ్డులో మృతదేహం ఉన్నట్లు తెలియగానే తమ సిబ్బంది సంఘటనాస్థలానికి వెళ్లి అక్కడ లభించిన ఆధార్‌, కార్డు కుమారుడి ఫోన్‌నంబరు ఆధారంగా డీడీ అచ్చెన్న మృతదేహంగా గుర్తించామని తెలిపారు. మృతదేహాన్ని శుక్రవారం అర్ధరాత్రి అనంతరం కుటుంబసభ్యులకు అందజేశామన్నారు. అచ్చెన్న విధుల నుంచి సస్పెన్షన్‌కు గురికావడంతో మనస్తాపానికి గురైనట్లు సమాచారం ఉందన్నారు. ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక మరేఇతర కారణాలున్నాయా అనే కోణంలో సమగ్ర విచారణ చేపడతామన్నారు. ఆయనవెంట సీఐ వరప్రసాద్‌, ఎస్‌.ఐ. జయరాములు తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని