logo

ఘనంగా జ్యోతిబా ఫులే విగ్రహావిష్కరణ

మూఢ విశ్వాసాలు, అంటరానితనంపై ప్రజలను చైతన్యపరిచి విజ్ఞానం వైపు నడిపించిన మహాత్మా జ్యోతిబా ఫులే ఆదర్శప్రాయులని బహుజన సేన, బీసీ సంఘాల నాయకుడు శ్రీచందు, మోడెం రాజశేఖర్‌ అన్నారు.

Published : 12 Apr 2024 03:00 IST

మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే : మూఢ విశ్వాసాలు, అంటరానితనంపై ప్రజలను చైతన్యపరిచి విజ్ఞానం వైపు నడిపించిన మహాత్మా జ్యోతిబా ఫులే ఆదర్శప్రాయులని బహుజన సేన, బీసీ సంఘాల నాయకుడు శ్రీచందు, మోడెం రాజశేఖర్‌ అన్నారు. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లె మార్కెట్‌ యార్డు వద్ద జ్యోతిబా ఫులే జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నాటి బ్రాహ్మణీయ మనువాద భావజాలాన్ని ఎదిరించి స్త్రీలకు విద్యనందించిన విద్యాదాతగా కొనియాడారు. తన భార్యను ఉపాధ్యాయురాలిగా చేసి దేశానికి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిని అందించారన్నారు. స్త్రీలు చదువుకోవడానికి వీలుగా రాత్రి పాఠశాలలను ఏర్పాటు చేసి విద్యను బోధించారన్నారు. ఇలాంటి మహనీయుని విగ్రహాన్ని నేడు మదనపల్లె ఆవిష్కరించడం గర్వించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు రెడ్డెప్ప, రమేష్‌యాదవ్‌, పులి శ్రీనివాసులు, గోవిందు, ప్రసాద్‌, నాగరాజు, సోము, డి.వి.రమణ, బహుజనసేన ఉద్యోగుల సంఘం నాయకుడు చెన్నకేశవులు, రాయల్‌బాబు, చిట్టిబాబు, కె.ఆనంద్‌,రాఘవేంద్ర, రూపక్‌నాయక్‌, భానుప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

రాయచోటి : అణగారిన వర్గాల వారి కోసం అభ్యున్నతికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు ఫులే అని డీఆర్వో సత్యనారాయణరావు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన సేవలను కొనియాడారు. బడుగు, బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలిచారన్నారు. పట్టణంలోని దిగువ పెట్రోలు బంకు సమీపంలోని జాతీయ రహదారిపై ఉన్న ఫులే విగ్రహానికి బీసీ సంఘం జాతీయ నాయకుడు వండాడి వెంకటేశ్వర్లు, రవిరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ వాసుబాబులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని