logo

బోరు వేశారు... పైపులు మరిచారు

మండలంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. బోర్లులో నీటి మట్టం తగ్గడంతో సమస్య ఎక్కువగా ఉంది. కొన్ని గ్రామాల్లో వచ్చే అరకొర నీటితోనే ప్రజలు సరిపెట్టుకుంటున్నారు.

Published : 12 Apr 2024 03:03 IST

చెరువుకిందపల్లెలో తాగునీటి సమస్య

పెద్దమండ్యం, న్యూస్‌టుడే: మండలంలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. బోర్లులో నీటి మట్టం తగ్గడంతో సమస్య ఎక్కువగా ఉంది. కొన్ని గ్రామాల్లో వచ్చే అరకొర నీటితోనే ప్రజలు సరిపెట్టుకుంటున్నారు. మరికొన్ని గ్రామాల్లో ప్రైవేటు బోర్లను ఆశ్రయిస్తున్నారు. కొందరు ట్యాంకర్ల ద్వారా నీటిని తోలుకుంటున్నారు. పెద్దమండ్యం పంచాయతీ గెల్చంవారిపల్లెలో సమస్య అధికంగా ఉంది. రెడ్డివారిపల్లెలో సమస్య ఎక్కువగా ఉండడంతో ట్యాంకర్లుతో నీటిని తోలుకుంటున్నారు. చెరువుకిందపల్లెలో నీటి సమస్య తీర్చడానికి పంప్‌హౌస్‌ దగ్గర బోరు వేసి మోటరు అమర్చారు కానీ పైప్‌లైన్‌ వేయడానికి గాడితీసి వదిలేశారు. పాపేపల్లిలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కొన్ని గ్రామాల్లో తాగునీటి బోర్ల నుంచి నీటిని పంట పొలాలకు వాడుకుంటున్నారనే విమర్శలున్నాయి. అధికారులు స్పందించి తాగునీటి సమస్య తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని