logo

వైకాపా నేతలు బాహుదాను కొల్లగొట్టేశారు: నల్లారి

పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం, కలికిరి, కలకడ మండలాల్లో ప్రవహిస్తున్న బాహుదా నదిని అయిదేళ్లపాటు వైకాపా నేతలు కొల్లగొట్టారని, పక్క రాష్ట్రాలకు ఇసుకను తరలించి రూ.వేల కోట్లు సంపాదించుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు.

Published : 12 Apr 2024 03:05 IST

కలికిరి గ్రామీణ, న్యూస్‌టుడే: పీలేరు నియోజకవర్గంలోని వాల్మీకిపురం, కలికిరి, కలకడ మండలాల్లో ప్రవహిస్తున్న బాహుదా నదిని అయిదేళ్లపాటు వైకాపా నేతలు కొల్లగొట్టారని, పక్క రాష్ట్రాలకు ఇసుకను తరలించి రూ.వేల కోట్లు సంపాదించుకున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కలికిరి మండలం నగరిపల్లెలో గురువారం ఆయన నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైకాపా నాయకులు దోచుకున్న డబ్బుతో ఓటర్లను ప్రలోభపెట్టాలని చూస్తున్నారని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పీలేరు శివార్లలోని ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వైకాపా నాయకులు వెంచర్లు వేసి అమ్ముకున్నారని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. తన సోదరుడు నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పీలేరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తప్ప వైకాపా నాయకులు చేసిందేమీలేదని పేర్కొన్నారు. వైకాపా పాలనలో నాసిరకం మద్యం, ఇసుక అక్రమ రవాణా, అక్రమ కేసులు, దౌర్జన్యాలు, అరచకాలే ఉన్నాయని విమర్శించారు. రాష్ట్రాభివృద్ధి, భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం ప్రజలందరూ ఎన్డీఏ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనవెంట నాయకులు రఘురామిరెడ్డి, ప్రతాప్‌కుమార్‌రెడ్డి, చంద్రశేఖర్‌, కృష్ణారెడ్డి తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని