logo

అరాచక పాలనకు స్వస్తి పలుకుదాం

రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, రాక్షస పాలన మాత్రమే సాగిందని, వైకాపా అరాచక పాలనకు ప్రజలందరూ బుద్ధి చెప్పాలని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Published : 12 Apr 2024 03:07 IST

ఎన్‌డీఏ రాజంపేట ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు నల్లారి, సుగవాసి
తెదేపాలో చేరిన సానిపాయి వైకాపా సర్పంచి, ఎంపీటీసీసభ్యురాలు

వీరబల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అయిదేళ్ల వైకాపా పాలనలో ఏమాత్రం అభివృద్ధి జరగలేదని, రాక్షస పాలన మాత్రమే సాగిందని, వైకాపా అరాచక పాలనకు ప్రజలందరూ బుద్ధి చెప్పాలని భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. వీరబల్లి మండలం సానిపాయి సర్పంచి నేతి ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యురాలు నేతి పెద్దరెడ్డెమ్మలు తమ అనుచరులతో కలిసి గురువారం వైకాపా నుంచి తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తెదేపాలో చేరిన వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సుగవాసి మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలనను అంతంమొందించడానికి ప్రతి ఒక్కరూ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో తెదేపా రాజంపేట నాయకులు పోలి సుబ్బారెడ్డి, జనసేన పార్టీ నాయకులు యెల్లటూరి శ్రీనివాసరాజు, భాజపా నాయకులు సాయిలోకేశ్‌, నాగోతు రమేష్‌నాయుడు, వీరభద్రస్వామి ఆలయ కమిటీ మాజీ ఛైర్మన్‌ ఎద్దుల లక్ష్మీప్రసాద్‌, రామలింగయ్యనాయుడు, రవీంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.

సర్పంచులపై చిన్నచూపు : వైకాపా ప్రభుత్వంలో సీఎం జగన్‌ సర్పంచులను చిన్నచూపు చూశారని, ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని సానిపాయి సర్పంచి ఆంజనేయులు అన్నారు. గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధే తప్ప ప్రస్తుత ప్రభుత్వంలో ఒరిగిందేమీ లేదన్నారు. దీంతోనే తాము వైకాపా నుంచి తెదేపాలో చేరామని తెలిపారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి తమ వంతుగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని