logo

సొంత జిల్లాకు జగన్‌ చేసింది శూన్యం

సీఎం జగన్‌ ఆయన సొంత జిల్లాకు ఏం చేశారో చెప్పాలని తెదేపా రాయలసీమ పరిశీలకుడు బీద రవిచంద్రయాదవ్‌ డిమాండు చేశారు. సొంత తల్లీచెల్లినే కుటుంబం నుంచి వేరు చేసిన జగన్‌ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.

Published : 12 Apr 2024 03:11 IST

తెదేపా రాయలసీమ పరిశీలకుడు బీద రవిచంద్రయాదవ్‌ ధ్వజం

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, ఖాజీపేట: సీఎం జగన్‌ ఆయన సొంత జిల్లాకు ఏం చేశారో చెప్పాలని తెదేపా రాయలసీమ పరిశీలకుడు బీద రవిచంద్రయాదవ్‌ డిమాండు చేశారు. సొంత తల్లీచెల్లినే కుటుంబం నుంచి వేరు చేసిన జగన్‌ రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. ఖాజీపేట మండలం రావులపల్లెలో గురువారం వైకాపా నుంచి పెద్దఎత్తున తెదేపాలో చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై సీఎం జగన్‌ పాలనపై ధ్వజమెత్తారు. అయిదేళ్లుగా రాష్ట్ర ప్రజలు వైకాపా పాలనతో ఎంత విసిగిపోయారన్నది యువగళం పాదయాత్రలో స్పష్టంగా తెలిసిపోయిందన్నారు. సీఎం సొంత జిల్లాలో కూడా ప్రజలు తెదేపాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

పలువురు నేతలతో భేటీ: కడపలో తెదేపా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డితో భేటీ అయిన రవిచంద్రయాద్‌ అనంతరం పార్టీ కమలాపురం యువ నాయకుడు కృష్ణ చైతన్యరెడ్డిని ప్రత్యేకంగా కలిశారు. అనంతరం మైదుకూరు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల అభ్యర్థులు పుట్టా సుధాకర్‌యాదవ్‌, వరదరాజులరెడ్డితో సమావేశమయ్యారు. కడప ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్న భూపేష్‌రెడ్డితో మాట్లాడారు. వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో పర్యటించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు సూచనలు చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని