logo

భక్తిశ్రద్ధలతో ఈద్‌ ఉల్‌ ఫితర్‌

ఈద్‌ ఉల్‌ ఫితర్‌ పర్వదినం సందర్భంగా కడప నగరంలోని బిల్టప్‌ సమీపంలోని ఈద్గా మైదానంలో గురువారం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.

Published : 12 Apr 2024 03:15 IST

ఈద్గా మైదానంలో సామూహిక ప్రార్థనలు
భారీ సంఖ్యలో హాజరైన ముస్లిం సోదరులు

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: ఈద్‌ ఉల్‌ ఫితర్‌ పర్వదినం సందర్భంగా కడప నగరంలోని బిల్టప్‌ సమీపంలోని ఈద్గా మైదానంలో గురువారం ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరయ్యారు. పెద్ద దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని, ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మత గురువు మౌల్వి రంజాన్‌ పర్వదినం గొప్పతనాన్ని వివరించారు. ఎండ తీవ్రత దృష్ట్యా భారీగా చలువ పందిళ్లు వేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ సర్వమతాల సారాంశం ఒక్కటేనన్నారు. కులమతాలకు అతీతంగా జిల్లాలో, అటు రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి ఇఫ్తార్‌ విందుల్లో పాల్గొన్నారని తెలిపారు. ప్రతి మనిషి తనకున్నంతలో తోటివారికి సాయం అందించాలన్నారు. తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలన్నదే రంజాన్‌ సందేశమని పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు అమీర్‌బాబు, అఫ్జల్‌ఖాన్‌, నజీర్‌ అహమ్మద్‌, మహమ్మద్‌ షఫీ, కరీముల్లా, అలీఅక్బర్‌, సలావుద్దీన్‌, పెద్దసంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని