logo

బీసీల మేలుకోరేది తెదేపానే

తెదేపాతోనే బీసీల అభివృద్ధి జరుగుతుందని, వైకాపా ప్రభుత్వం వారికి తీవ్ర అన్యాయం చేసిందని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు.

Published : 13 Apr 2024 03:01 IST

ప్రొద్దుటూరు వైద్యం, న్యూస్‌టుడే: తెదేపాతోనే బీసీల అభివృద్ధి జరుగుతుందని, వైకాపా ప్రభుత్వం వారికి తీవ్ర అన్యాయం చేసిందని ప్రొద్దుటూరు శాసనసభ తెదేపా అభ్యర్థి నంద్యాల వరదరాజులురెడ్డి అన్నారు. స్థానిక పీఎన్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో శుక్రవారం నిర్వహించిన ‘జయహో బీసీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో బీసీ నాయకులకు పదవులు అలంకారప్రాయంగా మారాయని ఎలాంటి అధికార స్వేచ్ఛ వారికి దక్కలేదన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి వస్తేనే బీసీలకు సముచిత స్థానం లభిస్తుందన్నారు. బీసీలంతా తెదేపాకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు. అంతకు ముందు తెదేపా బీసీ నాయకులు చల్లా రాజగోపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం కార్పొరేషన్ల పేరుతో బీసీలను విడగొట్టిందన్నారు. వాటి ఏర్పాటుతో బీసీలకు ఒరిగిందేమీలేదన్నారు. కార్పొరేషన్‌ ఛైర్మన్లకు నిధులు, విధులు లేకుండా చేసి బీసీలను మోసగించారని ఆరోపించారు. తెదేపా ప్రభుత్వంలో బీసీలకు రుణాలు అందాయన్నారు. రానున్న ఎన్నికల్లో బీసీల సత్తా ఏమిటో చూపుతామన్నారు. బీసీలంతా ఏకమై వైకాపాను ఓడించాలని పిలుపునిచ్చారు. అనంతరం తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్‌, భాజపా నాయకులు గొర్రె శ్రీనివాసులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవగుడి గోపాల్‌రెడ్డి, కొత్తపల్లె సర్పంచి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, జయహో బీసీ కో-ఆర్డినేటర్‌ సుంకర వేణుగోపాల్‌, నాయకులు తాటి శ్రీనివాసులు, మల్లికార్జున, పల్లా శంకర్‌నారాయణ, బొర్రా రామాంజనేయులు, సిద్దయ్య, గంగరాజుయాదవ్‌, సుబ్బరాజు, సులయ్య తదితరులు పాల్గొన్నారు.

రాజుపాళెం:  రానున్న సార్వత్రిక ఎన్నికలలో తెదేపా ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను గెలిపించాలని నంద్యాల వరదరాజులు రెడ్డి శుక్రవారం రాజుపాళెం మండలంలోని వెంగాళాయపల్లె, గాదెగూడురు గ్రామల్లో ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వైకాపా అరాచకపాలనకు అంతం పలకాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నంద్యాల కొండారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మహేశ్వరరెడ్డి నెలకుర్తి నాగయ్యనాయుడు, చంద్రశేఖరరెడ్డి, రోశిరెడ్డి, బాలిరెడ్డి, సురేష్‌నాయుడు, వెంగాళాయపల్లెలో శ్రీనివాసులురెడ్డి, సూర్యనరసింహారెడ్డి, చంద్రనరసింహరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని