logo

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే నిర్వహిస్తామని ప్రైవేటు పరం చేయమని ఏ పార్టీ  హామీ ఇస్తుందో ఆ పార్టీకే కార్మిక వర్గం ఓటు వేస్తుందని ఎఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు డిమాండ్‌ చేశారు.

Published : 13 Apr 2024 03:05 IST

ప్రొద్దుటూరు పట్టణం, న్యూస్‌టుడే: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే నిర్వహిస్తామని ప్రైవేటు పరం చేయమని ఏ పార్టీ  హామీ ఇస్తుందో ఆ పార్టీకే కార్మిక వర్గం ఓటు వేస్తుందని ఎఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు డిమాండ్‌ చేశారు. శుక్రవారం  ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సీఎం జగన్‌ గంగవరం, క్రిష్ణపట్నంపోర్టులను ప్రైవేటు పరం చేయకుండా ప్రభుత్వ అధీనంలోనే కొనసాగిస్తామని హామీని ఇవ్వలేదన్నారు. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. మాజీ సీఎం చంద్రబాబు కూడా ఉక్కు కర్మాగారం ప్రభుత్వపరం చేయడంలో విఫలమయ్యారన్నారు. ఇండియా కూటమికి  ప్రతి ఒక్కరూ ఓట్లు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్‌, ఉప ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని