logo

శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈనెల 16న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Published : 13 Apr 2024 03:07 IST

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఈనెల 16న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్న నేపథ్యంలో శుక్రవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ తనిఖీ అధికారి నవీన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. పసుపు, కుంకుమ, కస్తూరి పసుపు, పచ్చ కర్పూరం, కుంకుమపువ్వు, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో ఉదయం సుప్రభాతసేవ అనంతరం ఆలయాన్ని శుద్ధి చేశారు. గర్భగుడి, అంతరాలయం, ముఖ మండపం, బలిపీఠం, ధ్వజస్తంభం, భక్త సంజీవరాయస్వామి ఆలయం తదితర ప్రాంతాల్లో సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని గోడలపై చల్లారు. అనంతరం మూలవరులను పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో సుందరంగా అలంకరించారు.

రామయ్యను దర్శించుకున్న ఈవో, కలెక్టర్‌ : ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారి ఎ.వి.ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు వేర్వేరుగా శుక్రవారం సందర్శించారు. ఆలయ మర్యాదలతో ఈవో, కలెక్టర్‌, ఇతర అధికారులకు స్వాగతం పలికారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణమూర్తులను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారిని సత్కరించారు. తితిదే జేఈవో వీరబ్రహ్మం, సంయుక్త కలెక్టర్‌ గణేష్‌కుమార్‌, కడప నగరపాలక కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖకుమార్‌, ఆర్డీవోలు మధుసూదన్‌, వెంకటరమణ, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో నటేష్‌బాబు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు