logo

ఓటమి భయంతోనే షర్మిల యాత్రకు అడ్డంకులు

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే పీసీసీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి వైయస్‌ షర్మిల జిల్లాలో చేపట్టిన న్యాయయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆరోపించారు.

Published : 13 Apr 2024 03:08 IST

మారుతీనగర్‌, న్యూస్‌టుడే:  సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే పీసీసీ అధ్యక్షురాలు, కడప పార్లమెంటు కాంగ్రెస్‌ అభ్యర్థి వైయస్‌ షర్మిల జిల్లాలో చేపట్టిన న్యాయయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర ఆరోపించారు. స్థానిక జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ జగన్‌ తన ఐదేళ్ల పాలనలో కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు, అవకాశాలు రాబట్టడంలో ఘోరంగా విఫలమయ్యారని, కనీసం సొంత జిల్లాను కూడా అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు. కనీసం కరవు మండలాలుగా ప్రకటించలేక పోయారని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు ఏ ఒక్కటీ పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. జగన్‌ వైఫల్యాన్ని, వివేకానందరెడ్డి హత్య కేసు వివరాలను షర్మిల ప్రజలకు వివరించడంతో జగన్‌లో ఓటమి భయం మొదలైందన్నారు. అందుకే వేంపల్లె, లింగాలలో అల్లరిమూకలతో యాత్రను అడ్డుకోవాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ, కలెక్టర్‌ జోక్యం చేసుకుని నిందితులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళతామని హెచ్చరించారు.  సమావేశంలో సీపీఐ నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని