logo

జగనన్న కాలనీలు... జనానికి కన్నీళ్లు...!

వైకాపా అయిదేళ్ల పాలనలో అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలా మారింది జగనన్న కాలనీ లబ్ధిదారుల పరిస్థితి. ఇళ్లకు అద్దె కట్టలేక సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు అప్పులు చేసి చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పూర్తికాక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు.

Published : 13 Apr 2024 03:26 IST

కనీస వసతుల్లేక లబ్ధిదారుల అవస్థలు
న్యూస్‌టుడే, జిల్లా బృందం

వైకాపా అయిదేళ్ల పాలనలో అమ్మబోతే అడవి కొనబోతే కొరివిలా మారింది జగనన్న కాలనీ లబ్ధిదారుల పరిస్థితి. ఇళ్లకు అద్దె కట్టలేక సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు అప్పులు చేసి చేపట్టిన ఇళ్ల నిర్మాణాలు పూర్తికాక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షలు పునాది నిర్మాణానికి కూడా సరిపోని పరిస్థితి. కాలనీల్లో కనీస మౌలిక వసతుల్లేకపోవడం, లబ్ధిదారులెవరూ కాలనీల్లో ఉండేందుకు ఆసక్తి చూపకపోవడంతో ముళ్ల కంపలు, పిచ్చి మొక్కలు పెరిగి అడవిని తలపిస్తున్నాయి. పలుచోట్ల తాగునీటి వసతి లేక లబ్ధిదారులే రూ.వేలు వెచ్చించి ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసుకుని నిర్మాణాలు చేసుకుంటున్నారు. విద్యుత్తు స్తంభాలు ఏర్పాటు చేసినా చాలా చోట్ల కనెక్షన్లు ఇవ్వకపోవడంతో అంధకారంలో మగ్గుతున్నారు. రహదారులు, వీధులు ఎగుడుదిగుడు మట్టి, రాళ్ల దిబ్బలతో ఉండడంతో రాకపోకలు సాగించేందుకు, నిర్మాణ సామగ్రిని తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కాలనీలకు వెళ్లేందుకు రహదారులు సక్రమంగా లేకపోవడంతో మైళ్ల కొద్దీ తిరిగి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా జగనన్న కాలనీ లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు