logo

గజ వాహనంపై శ్రీరాముడు

వాల్మీకిక్షేత్రంలోని శ్రీరాముడి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు.

Published : 13 Apr 2024 03:27 IST

వాల్మీకిపురం, న్యూస్‌టుడే: వాల్మీకిక్షేత్రంలోని శ్రీరాముడి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. ఆలయ ఆస్థాన మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన సేవ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు ధ్వజారోహణ అనంతరం భేరి తాడనం, దేవతాహ్వాన కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌ మండపంలో స్వామి వార్లకు ఊంజల్‌సేవ జరిపారు. రాత్రి 7 గంటలకు విశేషాలంకరణలో ముస్తాబైన స్వామివార్లను గజవాహనంపై ఊరేగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని