logo

బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తితిదే ఈవో ఎ.వి.ధర్మారెడ్డి పేర్కొన్నారు.

Published : 13 Apr 2024 03:29 IST

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే: ఒంటిమిట్ట కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని తితిదే ఈవో ఎ.వి.ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఒంటిమిట్ట పరిపాలన భవనంలో శుక్రవారం తితిదే, జిల్లా అధికారులతో సమన్వయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ ఈ నెల 16న ఉత్సవాలకు అంకురార్పణ, 22న సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు రాములోరి పరిణయ వేడుకలను నేత్రపర్వంగా నిర్వహిస్తామన్నారు. భక్తులు అసౌకర్యానికి గురికాకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు. కలెక్టరు విజయరామరాజు మాట్లాడుతూ ఈ నెల 15 లోపు పనులన్నీ పూర్తి చేయాలన్నారు.పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని డీపీవో ప్రభాకర్‌రెడ్డిని, విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ రమణను ఆదేశించారు. సమావేశంలో జేఈవో వీరబ్రహ్మం, జేసీ గణేష్‌కుమార్‌, ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌, సీఈ నాగేశ్వరరావు, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్‌కుమార్‌, ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈఈ సుమతి, డిప్యూటీ ఈవోలు గుణభూషణ్‌రెడ్డి, నటేష్‌బాబు, ప్రశాంతి, ఈఈ సుమతి, డ్వామా పీడీ యదుభూషణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని