logo

పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్‌ నామినేషన్‌

సీఎం జగన్‌ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు.

Updated : 25 Apr 2024 08:37 IST

 పులివెందులలో సీఎం జగన్‌ నిర్వహించే సభా ప్రాంగణం చుట్టూ వైకాపా రంగులతో ఏర్పాటు చేసిన పరదాలు

పులివెందుల, న్యూస్‌టుడే : సీఎం జగన్‌ వైకాపా పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ వేసేందుకు గురువారం పులివెందుల రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. స్థానిక సీఎస్‌ఐ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగసభ ప్రాంగణం చుట్టూ వైకాపా జెండా రంగులతో కూడిన పరదాలు ఏర్పాటు చేశారు. సీఎం వెళ్లే మార్గాలు, మినీ సెక్రటేరియట్‌ వద్ద పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు 1,800 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పులివెందులలో ఆర్టీసీ బస్సుల రూటు మార్చినట్లు పులివెందుల డీఎస్పీ వినోద్‌కుమార్‌ తెలిపారు. పులివెందుల పట్టణానికి గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చే బస్సులన్నీ విజయహోమ్స్‌ రింగురోడ్డు, కదిరి రింగురోడ్డు, అంబకపల్లి రింగురోడ్డు, పార్నపల్లి రింగురోడ్డు, ముద్దనూరు రింగురోడ్డు మీదుగా ఆర్టీసీ బస్టాండుకు వెళ్లాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని