logo

ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు

ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు.

Updated : 20 May 2024 07:53 IST

90 శాతానికి పైగా పోలింగ్‌
ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
పట్టణ ప్రాంతాల్లో తగ్గిన ఓటింగ్‌ శాతం

టు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. వారేమైనా ఉన్నత విద్యావంతులా అంటే కాదనే చెప్పాలి. రెక్కాడితేనేకానీ డొక్కాడని నిరుపేదలు, కూలీలు, రైతుబిడ్డలు. కానీ ఓటు వేయడంలో మాత్రం వారిని మించిన ఐశ్వర్యవంతులు లేరు. ఎక్కడున్నా.. ఏ మూలన ఉన్నా.. పోలింగ్‌ రోజు మాత్రం సొంతూరికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదేమంటే మాత్రం ప్రాణాలున్నంత వరకు ఓటేస్తామని ఒట్టేశాం.. ఓటేయకపోతే మేము చచ్చినట్లే లెక్కని చెబుతున్నారంటే ప్రజాస్వామ్యంపై వారికున్న నిబద్దత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో సంపన్నులు, విద్యావంతులు, వ్యాపారులు ఉన్న ప్రధాన పట్టణాల్లో పోలింగ్‌ శాతం అంతంత మాత్రంగానే ఉండగా పల్లెవాసులు మాత్రం శెభాషనిపించుకున్నారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఉండగా 90 శాతానికిపైగా పోలింగ్‌ జరిగిన అలాంటి గ్రామాల ఉదంతం. పట్టణాల్లో అన్ని విధాలా సౌకర్యాలున్నా పోలింగ్‌ కేంద్రాల వైపు తొంగి చూడని జనం ఉండగా పల్లెల్లో మాత్రం తాము ఓటరు మారాజులేమనని నిరూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో అలాంటి గ్రామాలివి.

న్యూస్‌టుడే, కడప, కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని