logo

భూసంస్కరణల అమలుతోనే వ్యవసాయ కార్మికుల పురోభివృద్ధి

దేశవ్యాప్తంగా భూసంస్కరణలు పక్కాగా అమలు చేసినప్పుడే వ్యవసాయ కార్మికుల జీవితాల్లో పురోభివృద్ధి సాధ్యమవుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి విక్రమ్‌సింగ్‌ వెల్లడించారు.

Published : 25 May 2024 03:30 IST

అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి విక్రమ్‌సింగ్‌ 

బి.కొత్తకోట, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా భూసంస్కరణలు పక్కాగా అమలు చేసినప్పుడే వ్యవసాయ కార్మికుల జీవితాల్లో పురోభివృద్ధి సాధ్యమవుతుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సహాయ కార్యదర్శి విక్రమ్‌సింగ్‌ వెల్లడించారు. బి.కొత్తకోట మండలం పర్యాటక కేంద్రమైన హార్సిలీహిల్స్‌లోని ప్రైవేటు అతిథి గృహ ప్రాంగణంలో రెండో రోజైన శుక్రవారం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా విక్రమ్‌సింగ్‌ మాట్లాడుతూ... వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా ఉద్యమాలు బలోపేతం కావాలని ఆకాంక్షించారు. భాజపా ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్పోరేట్‌ అనుకూల విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, రైతులు దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. భాజపా విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాలు బలోపేతమవుతున్నాయని, దీని కోసం తమ వంతు కృషి చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఉపాధి కార్మికులు పనులు చేస్తున్న ప్రాంతాల్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని నాయుకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టజీవుల సమస్యలను పరిష్కరించడం కోసం అవసరమైతే స్థానికంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు దడాల సుబ్బారావు, శ్రీనివాసులు, రవి, నారాయణ, పుల్లయ్య, అన్వేష్, ఓబులరాజు, పెద్దన్న, కృష్ణమూర్తిలు ఇందులో పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు