logo

సారూ! తలుపులు... కిటికీల సరఫరా మరిచారు

నాడు-నేడు పనులకు అవసరమైన తలుపులు, కిటికీలు సరఫరా చేయడంలో జాప్యం అవుతుండడం వల్ల పనులు వేగంగా జరగడం లేదని పలువురు ఉపాధ్యాయులు డీఈవో యు.శివప్రకాష్‌రెడ్డిని కోరారు.

Published : 26 May 2024 03:53 IST

డీఈవోకు విన్నవించిన ఉపాధ్యాయులు

డీఈవో శివప్రకాష్‌రెడ్డిని సత్కరిస్తున్న ఎంఈవో లోకేశ్వరరెడ్డి, ఉపాధ్యాయులు

పీలేరు, న్యూస్‌టుడే: నాడు-నేడు పనులకు అవసరమైన తలుపులు, కిటికీలు సరఫరా చేయడంలో జాప్యం అవుతుండడం వల్ల పనులు వేగంగా జరగడం లేదని పలువురు ఉపాధ్యాయులు డీఈవో యు.శివప్రకాష్‌రెడ్డిని కోరారు. శనివారం డీఈవో పీలేరులో జరుగుతున్న ఇంటర్, పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను తనిఖీ చేయడంతో పాటు నాడు-నేడు పనులను పరిశీలించారు. అనంతరం ఎంఈవో కార్యాలయంలో జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో మాట్లాడిన సందర్భంగా ఉపాధ్యాయులు నాడు-నేడు పనుల ప్రగతిని సమీక్షిస్తున్నారే కానీ ప్రభుత్వపరంగా రావాల్సిన సామగ్రిని తెప్పించడంలో తీవ్రజాప్యం అవుతోందన్నారు. దీనిపై డీఈవో మాట్లాడుతూ... సామగ్రి సరఫరాలో జాప్యం లేకుండా ఉన్నతాధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శివప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక అవసరాలు గల పిల్లల సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బృందంతో సమీక్షించి సర్వే సంపూర్ణంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నాడు-నేడు కార్యక్రమంలో జరుగుతున్న పనులు ప్రతి వారం రెండు పాఠశాలలు ఆల్‌ కాంపోనెంట్స్‌ పూర్తి అయ్యేటట్లు ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని ఎంఈవోలను ఆదేశించారు. విద్యా కానుక స్టాక్‌ పాయింట్‌ ఉన్న ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసి వస్తువులు ఎక్కడెక్కడ నిల్వ ఉంచడానికి ఏవిధంగా ప్లాన్‌ చేసుకున్నారు విద్యా కానుక కిట్లను ఎలా ప్యాక్‌ చేస్తారు, ఎలా పంపిణీ చేస్తారన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పీలేరు, కంభంవారిపల్లె ఎంఈవోలు లోకేశ్వరరెడ్డి, రెడ్డిబాషా, పీలేరు ఎంఈవో-2 పద్మావతి, రీసోర్స్‌పర్సన్లు, మురళీధర్‌రాజు, అశోక్‌కుమార్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని