logo

బడి చుట్టూ మురుగు... పడేదెలా అడుగు

ప్రొద్దుటూరు పట్టణంలోని రెండో ఠాణా సమీపంలో గల కశెట్టి ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణం. పాఠశాల సమీపంలోని కాలువలో మురుగు ఇలా పాఠశాల ప్రాంగణాన్ని ముంచేసింది.

Published : 26 May 2024 03:59 IST

చిత్రంలో కనిపిస్తోంది ప్రొద్దుటూరు పట్టణంలోని రెండో ఠాణా సమీపంలో గల కశెట్టి ఎయిడెడ్‌ ఉన్నత పాఠశాల క్రీడాప్రాంగణం. పాఠశాల సమీపంలోని కాలువలో మురుగు ఇలా పాఠశాల ప్రాంగణాన్ని ముంచేసింది. పాఠశాలను తెరిచే నాటికి సమస్య పరిష్కరించకపోతే విద్యార్థులు, ఉపాధ్యాయులు లోపలకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. మరోపక్క ఇక్కడ పరిస్థితితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  తక్షణమే పురపాలక సంఘం అధికారులు చర్యలు చేపట్టాలని వారంతా కోరుతున్నారు. ఈ విషయమై శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ గోవిందరెడ్డి మాట్లాడుతూ పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

ఈనాడు, కడప, న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని