logo

రాష్ట్రంలో ఎన్‌డీఏదే అధికారం : తులసిరెడ్డి

ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తెదేపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముందని కాంగ్రెస్‌ మీడియా సెల్‌ రాష్ట్ర ఛైర్మన్‌ తులసిరెడ్డి జోస్యం చెప్పారు.

Published : 27 May 2024 03:57 IST

వేంపల్లె, న్యూస్‌టుడే: ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తెదేపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముందని కాంగ్రెస్‌ మీడియా సెల్‌ రాష్ట్ర ఛైర్మన్‌ తులసిరెడ్డి జోస్యం చెప్పారు. వేంపల్లెలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 2014 నాటి ఎన్నికల ఫలితాలు పునరావృతమయ్యే అవకాశముందన్నారు. 2014లో తెదేపా 102, జగన్‌ పార్టీకి 67 సీట్లు వచ్చాయని, ఈ ఎన్నికల్లో కూడా స్వల్ప మెజార్టీతో తెదేపా కూటమి అధికారంలోకి రావొచ్చన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి ఓట్ల శాతం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కడప లోక్‌సభకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి షర్మిలారెడ్డికి భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందన్నారు. మైనార్టీల ఓట్లు గణనీయంగా కాంగ్రెస్‌ పార్టీకి పడ్డాయని అందువల్ల షర్మిల ఎంపీగా గెలిచే అవకాశాలున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  కేంద్రంలో ఏ పార్టీకీ సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు 272 సీట్లు రావని... సంకీర్ణ ప్రభుత్వం తప్పదన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని