logo

kadapa: అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి దృష్ట్యా  ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేలు నోడల్ డీఎస్పీ రవికుమార్ తెలిపారు.

Updated : 25 May 2024 17:11 IST

కల‌స‌పాడు: సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడి దృష్ట్యా  ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బద్వేలు నోడల్ డీఎస్పీ రవికుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం పోరుమామిళ్ల సీఐ చిరంజీవి, కలసపాడు ఎస్సై నాగమురళి హెచ్చరించారు. శనివారం కలసపాడు పోలీస్ స్టేషన్ ఆవరణలో మండల పరిధిలోని వివిధ పంచాయతీలకు చెందిన గ్రామాల్లోని అన్ని పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ పాటిస్తూ ప్రజలు, రాజకీయ నాయకులు శాంతికి సహకరించాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజు, తర్వాత 144 సీఆర్పీసీ, ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుందన్నారు. ఎక్కడ  కూడా గుంపులుగా ఉండడం, ఫైర్ క్రాకర్స్ పేల్చడం లాంటి చర్యలకు పాల్పడకూడదని తెలిపారు. ఫలితాల అనంతరం గ్రామాల్లో ఎటువంటి అల్లర్లు, గొడవలు, రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ఘర్షణలు సృష్టిస్తే నాన్ బెయిలబుల్ కేసునమోదు చేసి, రౌడీషీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు.

Ap news, telugu News, Politics

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు