logo

రాజపాళెంలో పోలీసుల కవాతు

మండలంలోని రాజపాళెంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆదివారం క‌ల‌స‌పాడు, కాశినాయ‌న‌ ఎస్సైలు నాగమురళి, అమ‌ర్నాధ‌రెడ్డి పోలీస్ బలగాలు కవాతు, గ్రామసభ ఏర్పాటు చేశారు. 

Updated : 26 May 2024 13:04 IST

కలసపాడు: మండలంలోని రాజపాళెంలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఆదివారం క‌ల‌స‌పాడు, కాశినాయ‌న‌ ఎస్సైలు నాగమురళి, అమ‌ర్నాధ‌రెడ్డి పోలీస్ బలగాలు కవాతు, గ్రామసభ ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  కౌంటింగ్ రోజు, కౌంటింగ్ త‌రువాత‌ ఎలాంటి అవాంఛనీయ సంఘటన‌ల‌కు పాల్పడకూడదన్నారు. గ్రామంలో గడ్డివాములు, గృహాలు, పలుచోట్ల సోదాలు చేశారు. అనుమతి లేకుండా అక్రమ మద్యం, మందు గుండు సామగ్రి వంటివి దగ్గర ఉంచుకున్నా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమస్యల జోలికి వెళ్లిన సమస్యలు సృష్టించినా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయ‌డంతో పాటు రౌడీషీట్ తెరుస్తామ‌ని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని