logo

ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీలు పట్టివేత

ప్రొద్దుటూరు పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు లారీలను ఆదివారం వేకువ జామున ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.

Updated : 26 May 2024 10:58 IST

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పెన్నానది నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు లారీలను ఆదివారం వేకువ జామున ప్రొద్దుటూరు సబ్ డివిజనల్ అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఎర్రగుంట్ల మండలం వెంకన్నపల్లి వద్ద డంపు చేసిన ఇసుకను లోడు చేసి అర్ధరాత్రి వేళల్లో నిత్యం రహస్యంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు బృందంగా ఏర్పడి కాపు కాచి రెండు లారీలను స్వాధీనం చేసుకొని సబ్ డీఎఫ్‌ఓ కార్యాలయం ఆవరణలో ఉంచారు. ఈ ఇసుకను కర్నూల్, హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు లారీల ఇసుక విలువ రూ. లక్షకు పైగా అక్రమార్కులు విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని