logo

చెన్నారెడ్డిపల్లెలో నీటి సమస్య

మండలంలోని చెన్నారెడ్డిపల్లె దళితవాడలో రెండు రోజులుగా నీటి పథకం మోటర్ చెడిపోవడంతో స్థానికులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 27 May 2024 13:36 IST

కలసపాడు: మండలంలోని చెన్నారెడ్డిపల్లె దళితవాడలో రెండు రోజులుగా నీటి పథకం మోటర్ చెడిపోవడంతో స్థానికులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల తరచూ నీటి పథకం మోటారుకు సాంకేతిక సమస్యలు ఎదురై నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.  అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ విషయమై ఎంపీడీవో కోటేశ్వరరావును వివరణ కోరగా త్వరగా నీటి పథకం మోటర్‌కు మరమ్మత్తులు చేయించి నీటి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని