logo

పోలీసుల అదుపులో దాడి ఘటన నిందితులు?

Published : 29 Nov 2023 02:28 IST

ప్రొద్దుటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: ప్రొద్దుటూరు తెదేపా నేత నందం సుబ్బయ్య హత్య కేసు నిందితుడు బెనర్జీపై జరిగిన దాడి కేసులో పట్టణానికి చెందిన భరత్‌ కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అక్టోబర్‌ 28న బెనర్జీపై భరత్‌కుమార్‌రెడ్డి దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో భరత్‌కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలతో పాటు తెదేపా ప్రొద్దుటూరు బాధ్యుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై కూడా కేసు నమోదవడం, రిమాండుకు తరలించడం... ఈనెల 22న ఆయన బెయిల్‌పై ఆయన విడుదల అయిన విషయం విధితమే. కాగా భరత్‌ కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. దీనిపై సీఐ వెంకటరమణను వివరణ కోరగా భరత్‌ కుమార్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డిలను తాము అదుపులోకి తీసుకోలేదని, వారిని పట్టుకునేందుకు నెల రోజులుగా తిరుగుతున్నామని తెలిపారు.


డీలరు చేతివాటం...చౌక ధరల దుకాణం సీజ్‌

ప్రొద్దుటూరు గ్రామీణ, న్యూస్‌టుడే: స్థానిక వివేకానందనగర్‌లోని 122వ చౌకదుకాణంలో 2 వేలు కిలోల రేషన్‌ బియ్యం తక్కువగా ఉన్నాయని జిల్లా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ రెడ్డెప్ప మంగళవారం తనిఖీలో గుర్తించారు. డీలర్‌ చేతివాటంపై పక్కాగా సమాచారం అందుకున్న సీఐతో పాటు మిల్లు ఆర్‌ఐ సాయిప్రసాదు సరకులు నిల్వ చేసిన గది వద్దకు వెళ్లి సోదాలు చేశారు. ఈ సందర్భంగా డిసెంబరు 1 నుంచి లబ్ధిదారులకు పంపిణీ నిమిత్తం తరలించిన రేషన్‌ బియ్యంలో ఆ మేరకు తక్కువ పరిమాణం ఉన్నందున దుకాణం సీజ్‌ చేసి వీఆర్వో మునిస్వామికి అప్పగించారు. బాధ్యులైన డీలర్‌ కల్పనపై 6-ఏ కేసు నమోదు చేశామని మిల్లు ఆర్‌ఐ సాయిప్రసాదు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని