logo

ఆగండి... వెళ్లిపోవద్దు

కడప నగరానికి అత్యంత సమీపంలోని నియోజకవర్గంలోని అధికార. వైకాపాకు చెందిన ఓ కౌన్సిలర్‌ తెదేపాలోకి చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కౌన్సిలర్‌ స్థాయి వ్యక్తి పార్టీ మారితే నష్టంగా ఉంటుందని భావించిన కీలక నేత వెంటనే అప్రమత్తమయ్యారు.

Published : 29 Nov 2023 02:30 IST

పార్టీ మారకుండా సర్దుబాటు చేసిన అధికార వైకాపా నేత
రూ.5 లక్షల నగదు...రూ.20 లక్షల కాంట్రాక్టు అప్పగింత

ఈనాడు, కడప: కడప నగరానికి అత్యంత సమీపంలోని నియోజకవర్గంలోని అధికార. వైకాపాకు చెందిన ఓ కౌన్సిలర్‌ తెదేపాలోకి చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కౌన్సిలర్‌ స్థాయి వ్యక్తి పార్టీ మారితే నష్టంగా ఉంటుందని భావించిన కీలక నేత వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ ప్రజాప్రతినిధిని కలిసి రూ.5 లక్షలిచ్చి సర్దిచెప్పడంతో పాటు రూ.20 లక్షల కాంట్రాక్టు పనులు ఇప్పిస్తాననే భరోసాతో పార్టీ మారకుండా నిలువరించారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి తెదేపాలోకి వలసలు అధికంగా ఉన్నాయి. ఓ మండలం నుంచి భారీగా ఇటీవల చేరికలు జరుగుతున్నాయి. కుటుంబాలు కుటుంబాలే విపక్ష పార్టీలో చేరిపోతున్నాయి. జిల్లాలోని ఈ నియోజకవర్గం నుంచే వలసలు మొదలయ్యాయి. నిత్యం ఏదో ఒక రూపంలో వివిధ స్థాయిల నేతలు, కార్యకర్తలు చేరిపోతున్నారు. వైకాపా కౌన్సిలర్లు కొందరు చేరికకు సన్నద్ధం కాగా, ప్రారంభంగా ఓ నేత సిద్ధపడ్డారు. చాలా మంది పోలీసు కేసులకు భయపడి అధికార పార్టీలో ఇబ్బందికర పరిస్థితిలో కొనసాగుతున్నారని వైకాపాలోని కొందరు నేతలు చెబుతున్నారు. గతంలో పార్టీ మారతారన్న నేతల్లో కొందరిపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. సాధారణ ఎన్నికలకు సమీపించే కొద్దీ వలసలు అధికంగా ఉంటాయంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని