logo

నలుగురు ఎర్రచందనం దొంగల అరెస్టు

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు  ఒంటిమిట్ట సీఐ పురుషోత్తమరాజు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ..

Published : 29 Nov 2023 02:36 IST

స్వాధీనం చేసుకున్న దుంగలు, అరెస్టు చేసిన కూలీలను చూపుతున్న సీఐ పురుషోత్తమరాజు, ఎస్‌.ఐ మధుసూదనరావు

ఒంటిమిట్ట, న్యూస్‌టుడే:  ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు  ఒంటిమిట్ట సీఐ పురుషోత్తమరాజు తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ మండలంలో నర్వకాటిపల్లె శివారు యల్లా పుల్లల బావి కొండ ప్రాంతంలో దుంగలు రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌, కడప డీఎస్పీ షరీఫ్‌ ఆదేశాలతో ఎర్రచందనం ప్రత్యేక కార్యదళం సీఐ వినయ్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో నిఘా పెట్టారని తెలిపారు. అక్రమ రవాణా కోసం నిల్వ ఉంచిన 14 చందనం దుంగలను స్వాధీనం చేసుకుని,  అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఈదరపల్లికి చెందిన రామకృష్ణ, పెంచలయ్య, నందలూరుకు చెందిన షేక్‌ మహబూబ్‌బాషా, షేక్‌ వలీబాషాలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. కడపకు చెందిన నరసింహులు అనే వ్యక్తి పరారైనట్లు చెప్పారు. ఎస్‌.ఐ.మధుసూదనరావు, హెడ్‌కానిస్టేబుళ్లు వెంకటసుబ్బయ్య, నారాయణ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని