logo

డంపింగ్‌యార్డు కాదిది... సర్కారు బడి తీరిది!

చిత్రంలో కనిపిస్తోంది డంపింగ్‌ యార్డు అనుకుంటే చెత్తలో కాలేసినట్లే. ప్రభుత్వ పాఠశాలలను మనబడి..నాడు-నేడు కింద రూ.కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్న పాలకుల మాటలకు ఇక్కడ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయనడానికి ఈ చిత్రమే నిదర్శనం.

Updated : 29 Nov 2023 06:22 IST

చిత్రంలో కనిపిస్తోంది డంపింగ్‌ యార్డు అనుకుంటే చెత్తలో కాలేసినట్లే. ప్రభుత్వ పాఠశాలలను మనబడి..నాడు-నేడు కింద రూ.కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్న పాలకుల మాటలకు ఇక్కడ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయనడానికి ఈ చిత్రమే నిదర్శనం. సీఎం సొంత జిల్లా కేంద్రమైన కడప నగర శివారులోని ఆజాద్‌నగర్‌లోని ప్రభుత్వ ఉర్దూ పాఠశాల భవనాల ప్రహరీని ఆనుకుని కొండలా చెత్తనిల్వలు పేరుకుపోయాయి. అక్కడే మురుగునీరు నిల్వలుండడంతో తమ పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాల పరిసరాలను శుభ్రం చేయించాలని వారంతా కోరుతున్నారు.

ఈనాడు-కడప, న్యూస్‌టుడే, చిన్నచౌకు(కడప)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని