logo

పెద్దదర్గాకు రేపు సీఎం జగన్‌ రాక

కడప నగరంలో నిర్వహిస్తున్న పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో గురువారం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు.

Updated : 29 Nov 2023 06:21 IST

కడప పెద్దదర్గాలో పరిశీలిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌

కడప చిన్నచౌకు, న్యూస్‌టుడే: కడప నగరంలో నిర్వహిస్తున్న పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో గురువారం ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో పెద్దదర్గాను మంగళవారం కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ పరిశీలించారు. సీఎం పర్యటనకు పటిష్ఠ ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. భద్రత కట్టుదిట్టం చేయాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీరి వెంట ఏఆర్‌ అదనపు ఎస్పీ కృష్ణారావు, కడప డీఎస్పీ షరీఫ్‌, ఎస్‌బీ సీఐ వెంకటకుమార్‌ తదితరులున్నారు.

అలరించిన ముషాయిరా : పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేని ఆధ్వర్యంలో నిర్వహించిన ముషాయిరా అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా హాజరయ్యారు. సాయంత్రం 5 గంటలకు పీఠాధిపతి ఆధ్వర్యంలో మహానైవేద్యం కార్యక్రమం నిర్వహించారు. ప్రార్థన అనంతరం భక్తులకు పాసయాన్ని అందించారు. రాత్రి 7 గంటలకు మలంగ్‌షాను పీరి స్థానం నుంచి విముక్తి కలిగించారు. పకీర్ల  విన్యాసాలు అలరించాయి. ముషాయిరాలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కవులు తమ పాటలు, కవిత్వాలతో ముస్లిం సోదరులను మంత్రముగ్ధులను చేశారు. భారీగా భక్తులు తరలివచ్చారు.

ముషాయిరాలో పాల్గొన్న పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనీ, ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషాముస్లిం మత పెద్దలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని