logo

పాఠాలు అర్థం కావడం లేదమ్మా...!

అమ్మా.. పాఠాలు సరిగా అర్థం కావడం లేదు.. అందరి ముందు చాలా అవమానంగా ఉందని ఆ యువతి బాధపడుతుండేది.

Updated : 29 Nov 2023 09:13 IST

పెట్రోలు పోసుకుని విద్యార్థిని బలవన్మరణం

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: అమ్మా.. పాఠాలు సరిగా అర్థం కావడం లేదు.. అందరి ముందు చాలా అవమానంగా ఉందని ఆ యువతి బాధపడుతుండేది. నిదానంగా అర్థమవుతుందిలే అని తల్లి సముదాయించేది. ఆ విద్యార్థిని మాత్రం ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు పాల్పడింది. కడప చిన్నచౌకు ఠాణా పరిధిలో అశోక్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ వసతిగృహంలో వంట మనిషిగా పనిచేస్తున్న అల్లూరి సుమలతకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె. విభేదాల నేపథ్యంలో భర్త వెళ్లిపోవడంతో ఆమె పిల్లలతో కలసి ఉంటోంది. కుమార్తె కెజియా(18) పాతబస్టాండు సమీపంలోని ప్రభుత్వ బాలిక జూనియర్‌ కళాశాలలో తెలుగు మాధ్యమంలో ఇంటర్‌ చదివింది. ప్రస్తుతం ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ బీకాం కంప్యూటర్స్‌ ఆంగ్ల మాధ్యమంలో చేరింది. ఆమెకు ఇంగ్లిష్‌ మీడియం కొత్త కావడంతో పాఠాలు సరిగా అర్థమవడం లేదని బాధపడుతుండేది. ఈ నేపథ్యంలో మంగళవారం తల్లి వసతిగృహానికి వెళ్లగా, సోదరులు నిద్రపోతుండగా కెజియా ఇంట్లో ఉన్న పెట్రోలును ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. బాధ భరించలేక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి మంటలు ఆర్పారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని