logo

జాతీయ స్థాయి పురస్కారానికి మొర్రాయిపల్లె పాఠశాల ఎంపిక

విద్యా అమృత్‌ మహోత్సవ్‌ 2022-23లో భాగంగా వినూత్న బోధనలు చేపట్టిన ప్రాజెక్టుల్లో చాపాడు మండలం మొర్రాయిపల్లె ప్రాథమిక పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది.

Published : 30 Nov 2023 05:47 IST

 నాగలక్ష్మి
చాపాడు, న్యూస్‌టుడే: విద్యా అమృత్‌ మహోత్సవ్‌ 2022-23లో భాగంగా వినూత్న బోధనలు చేపట్టిన ప్రాజెక్టుల్లో చాపాడు మండలం మొర్రాయిపల్లె ప్రాథమిక పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 5.99 లక్షల ప్రాజెక్టులు నమోదుకాగా, అందులో పది జాతీయస్థాయి పురస్కారానికి ఎంపికయ్యాయి. అందులో మొర్రాయిపల్లె ప్రాజెక్టు ప్రథమ స్థానం సాధించడం విశేషం. పాఠశాలలో ఇదివరకు ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేసిన ఎం.నాగలక్ష్మి గణితంపై విద్యార్థులకు సులభంగా అవగాహన కలిగేలా శాశ్వత బోధనా అభ్యసన సామగ్రిని ఏర్పాటు చేశారు. పాఠశాల గోడలకు, కింద బండ చప్పటకు, ఇనుప గ్రిల్స్‌కు, ఆవరణలో ఆడుకునే స్థలంలో  గణితానికి సంబంధించిన సూచికలు కనబడేలా చొరవ తీసుకున్నారు. ఇది పిల్లలకు చక్కగా ఉపయోగపడుతుందని విద్యాశాఖ ఉన్నతాధికారులు గుర్తించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని