logo

‘దాచుకోవడం, దోచుకోవడమే వైకాపా ధ్యేయం’

అధికార వైకాపా నేతలు తమ ప్రయోజనాల కోసమే సర్వరాయసాగర్‌ నీటిని ఉపయోగించుకుంటున్నారే తప్ప ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించడం లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ధ్వజమెత్తారు

Published : 30 Nov 2023 05:57 IST

 మాట్లాడుతున్న భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌, పక్కన నాయకులు

వీరపునాయునిపల్లె, న్యూస్‌టుడే : అధికార వైకాపా నేతలు తమ ప్రయోజనాల కోసమే సర్వరాయసాగర్‌ నీటిని ఉపయోగించుకుంటున్నారే తప్ప ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించడం లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ ధ్వజమెత్తారు. సర్వరాయసాగర్‌ ఆనకట్టను బుధవారం ఆయన భాజపా నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వరాయసాగర్‌ నీటిని సీఎం జగన్‌ తన సొంత సిమెంటు పరిశ్రమకు తరలించుకుంటున్నారని మండిపడ్డారు. ఆర్‌ఎం కిసాన్‌ అనే ప్రైవేటు సంస్థకు కూడా నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. సీఎం మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్ర నాథ్‌రెడ్డి చేపల చెరువుకు నీటిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఒక్క ఎకరాకు కూడా నీరందించకపోవడం విచారకరమన్నారు. రూ.52 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు రూ.215 కోట్లతో ప్రతిపాదనలు పంపారని ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం దాచుకోవడం, దోచుకోవడం అనే సిద్ధాంతంతో పాలన సాగిస్తోందన్నారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఆయన వెంట పార్టీ వైయస్‌ఆర్‌ జిల్లా అధ్యక్షుడు శశిభూషన్‌రెడ్డి, నాయకులు సింగారెడ్డి రామచంద్రారెడ్డి, పాలెం సురేష్‌కుమార్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, గవేశ్వరయాదవ్‌, తదితరులున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని