logo

దొంగ ఓట్ల లెక్క తేల్చండి

ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారించి దొంగ ఓట్లను తొలగించాలని కలెక్టర్‌ గిరీషకు బుధవారం తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు.

Updated : 30 Nov 2023 06:41 IST

కలెక్టర్‌ గిరీషకు తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి వినతిపత్రం

 కలెక్టర్‌ గిరీషకు ఓటర్ల జాబితాలోని బోగస్‌, డబుల్‌ఎంట్రీ, మృతి చెందిన వారి వివరాలు అందజేస్తున్న తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు, నాయకులు

రాయచోటి, న్యూస్‌టుడే: ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారించి దొంగ ఓట్లను తొలగించాలని కలెక్టర్‌ గిరీషకు బుధవారం తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్‌మోహన్‌రాజు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు బోగస్‌, మృతిచెందిన, ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నవారి వివరాలు అందజేశారు. జిల్లాలో జీరో డోరు నంబరుపై 2 వేలకుపైగా ఓట్లు ఉన్నాయని, సుమారు 11 వేల మృతుల ఓట్లు జాబితా నుంచి తొలగించలేదని, 5 వేలకుపైగా డబుల్‌ ఎంట్రీ ఓట్లు, 15 వేలకుపైగా దొంగ ఓట్లు నమోదైనట్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందిస్తూ వెంటనే విచారించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మృతుల ఓట్లు వివరాలు తెలిపినా బీఎల్వోలు మరణ ధ్రువపత్రాలు ఇవ్వాలని అడుగుతున్నారని, అవి తాము ఎలా ఇవ్వగలమని కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటర్ల వివరాలు ఇస్తే విచారించి స్వచ్ఛమైన జాబితా రూపకల్పనకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వినతిపత్రం అందజేసినవారిలో మదనపల్లె, పీలేరు, రాజంపేట, రాయచోటి నియోజకవర్గాల నాయకులు తదితరులున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని