logo

చిరునామాల తప్పు... వజ్రాయుధానికి ముప్పు!

పీలేరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఓటర్ల జాబితా తీసుకున్నా అక్రమాలు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి.

Published : 23 Feb 2024 02:31 IST

అస్తవ్యస్తంగా ఓటర్ల తుది జాబితా
న్యూస్‌టుడే, పీలేరు, పీలేరు గ్రామీణ

పీలేరు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏ ఓటర్ల జాబితా తీసుకున్నా అక్రమాలు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. చిరునామాలు తప్పులతడకగా నమోదయ్యాయి. వీటిని ఎవరు పట్టించు కుంటారులే అనుకున్నారో ఏమో? ఇష్జారాజ్యంగా జాబితాలో నమోదు చేశారు. చిరునామా అని ఉన్నచోట ఇంటి సంఖ్య లేకుంటే జీరో అని, లేదా నోటికొచ్చిన సంఖ్యను ముద్రించి మమ అనిపించారు. పీలేరు పంచాయతీ 235వ పోలింగ్‌ కేంద్రంలో ఇలాంటి తప్పుడు ఇంటి సంఖ్యలతో ఆరుగురి ఓట్లు నమోదయ్యాయి. వీధి పేరు ఎక్కడా నమోదు చేయకుండా తుది ఓటర్ల జాబితాలో పేర్లు ముద్రించారు. పలుచోట్ల జీరో ఇంటి సంఖ్య చిరునామాతో అనేక ఓట్లు వెలుగులోకి వస్తున్నాయి.


పీలేరు పంచాయతీలోని 235వ పోలింగ్‌ కేంద్రంలోని వరుస సంఖ్య 377లో ఎన్‌టీజీ-1437591 ఐడీతో నమోదైన లక్ష్మీదేవి ఓటు ఇదే కేంద్రంలోని వరుస సంఖ్య 372లో ఐడీ నెంబరు ఎన్‌జీటీ- 116699పైనా నమోదైంది. రెహానా పఠాన్‌ ఓటు ఎలాంటి వీధి పేరు లేకుండా తప్పుడు ఇంటి సంఖ్యతో నమోదైంది. వరుస సంఖ్య 371లో ఎన్‌జీటీ-1337252 ఐడీతో వెంకట నాగయ్య ఓటులో ఇంటి సంఖ్య తప్పుగా వచ్చింది. వరుస సంఖ్య 375లో ఎన్‌టీజీ-1233022 ఐడీతో ఉన్న మొబీన్‌తాజ్‌ షేక్‌ ఓటు తప్పుడు ఇంటి సంఖ్యతో ముద్రితమైంది. వరుస సంఖ్య 376లో ఎన్‌టీజీ-147607 ఐడీతో ఉన్న శ్రీనివాసులు, 233వ పోలింగ్‌ కేంద్రంలోని వరుస సంఖ్య 378లో ఎన్‌టీజీ-1116723 ఐడీతో నమోదైన వై.రాణి ఓట్లు తప్పుడు ఇంటి సంఖ్యలతో నమోదయ్యాయి.


పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీలోని పోలింగ్‌ కేంద్రం 222లో ఓటర్ల పేర్ల చిరునామాల వద్ద తప్పులు కనిపిస్తున్నా అధికారులు జాబితా విడుదల చేయడంతో ఓట్లు పరిశీలించుకుంటున్న ఓటర్లు విస్తుపోతున్నారు. వరుస సంఖ్య 1లో సుకనయ యం, వరుస సంఖ్యలో 2లో అక్బర్‌ ఎస్‌, వరుస సంఖ్యలో 4లో మస్తాన్‌ షేక్‌, వరుస సంఖ్య 5లో బేదాశావల్లి ఇంటి సంఖ్యల వద్ద సున్నాగా నమోదైంది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని