logo

పనిచేయడమే నేరం... న్యాయమనడమే పాపం!

సక్రమంగా విధులు నిర్వహించడమే అన్నమయ్య జిల్లా పెద్ద  మండ్యం ఎస్‌.ఐ.వెంకటేష్‌ నేరమైంది... కడప రెండో పట్టణ సీఐ తబ్రేజ్‌ న్యాయంగా విధులు నిర్వహిస్తానంటూ చాటుకునే ప్రయత్నం చేయడంతో బదిలీ వేటు పడింది.

Published : 23 Feb 2024 02:40 IST

15 రోజులకే పెద్దమండ్యం ఎస్‌.ఐ. బదిలీ
నాలుగు నెలలకే వీఆర్‌కు కడప సీఐ తబ్రేజ్‌

ఈనాడు, కడప : సక్రమంగా విధులు నిర్వహించడమే అన్నమయ్య జిల్లా పెద్ద  మండ్యం ఎస్‌.ఐ.వెంకటేష్‌ నేరమైంది... కడప రెండో పట్టణ సీఐ తబ్రేజ్‌ న్యాయంగా విధులు నిర్వహిస్తానంటూ చాటుకునే ప్రయత్నం చేయడంతో బదిలీ వేటు పడింది. సుమారు 15 రోజుల కిందట పెద్దమండ్యం ఎస్‌.ఐ.గా బాధ్యతలు చేపట¨్టన వెంకటేష్‌ను అకస్మాత్తుగా మదనపల్లె తాలూకాకు బదిలీ చేశారు. ఎస్‌.ఐ.గా బాధ్యతలు చేపట¨్టన 15 రోజుల వ్యవధిలోనే 10 కేసులు నమోదు చేసి నేరస్థులపై కఠినంగా వ్యవహరించారు. వైకాపా నాయకుల మాట వినడం లేదని, ఎన్నికల్లో తమ కార్యకలాపాలు సాగవనే ఆందోళన ఆ పార్టీ నేతల్లో మొదలైంది. దీంతో వెంటనే బదిలీ చేసేశారు. ఆయన స్థానంలో ఉమ్మడి కడప జిల్లాలో విధులు నిర్వహిస్తున్న చెన్నకేశవులును నియమించారు. కడప నగరంలోని రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌ వద్ద తెదేపా, వైకాపా నేతల మధ్య ఇటీవల వివాదం జరిగింది. రెండు పార్టీల నేతలు ఘర్షణకు దిగారు. ఈ వ్యవహారంలో రెండు వర్గాలపై కేసులు నమోదు చేయాలనే నిర్ణయం తీసుకున్న సీఐ తబ్రేజ్‌పై బదిలీ వేటు వేశారు. రెండో పట్టణ సీఐగా బాధ్యతలు చేపట్టి సరిగ్గా నాలుగు నెలలు సైతం దాటకముందే వైకాపా నేతల ఒత్తిడితో వీఆర్‌కు బదిలీ చేశారు. ఈయన స్థానంలో ప్రొద్దుటూరు సీఐ ఇబ్రహీంను నియమించారు. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా పోలీసు అధికారులను నియమించుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని